కబడ్డీలో భారత్ సత్తా ఏంటో మరోసారి ఋజువైంది.ఇంచియాన్ లో జరుగుతున్న 17వ ఆసియా క్రీడల్లో భారత పురుషుల జట్టు ఇరాన్ ను ఓడించి వరుసగా 7వ సారి బంగారు పతకాన్ని దక్కించుకుంది.హోరాహోరీగా జరిగిన ఫైనల్ లో 27-25 తో ఇరాన్ ను చిత్తు చేసింది.
మొదటి హాఫ్ పూర్తయ్యే సమయానికి భారత్ 13-21 స్కోరు తేడాతో వెనకబడింది.ద్వితీయార్థంలో ఒక్కసారిగా పుంజుకున్న భారత్ ఆటగాళ్ళు 14 పాయింట్లు సాధించగా ఇరాన్ కేవలం 4 పాయింట్లు మాత్రమే సాధించగలిగింది.జస్వీర్,రాహుల్,రాకేశ్ రైడింగ్ లో రాణించారు.
1990లో మొదటిసారి ఆసియా క్రీడల్లో కబడ్డీ ఆటను ప్రవేశపెట్టారు.అప్పటినుండి ఇప్పటి వరకు భారత్ పురుషుల జట్టు స్వర్ణ పతకాన్ని గెలుస్తూ వస్తుంది.భారత మహిళల జట్టు కూడా ఇరాన్ ను ఫైనల్ లో ఓడించి వరుసగా రెండోసారి బంగారు పతకాన్ని దక్కించుకుంది
రాష్ట్రపతి,ప్రధాని ఇద్దరూ భారత్ జట్టుకు శుభాకాంక్షలు ట్విట్టర్ ద్వారా తెలిపారు.

భారత మహిళా కబడ్డీ జట్టు 17వ ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాన్ని నెగ్గి తమకు ఎదురులేదని మరోసారి నిరూపించింది.ఇది భారత మహిళా కబడ్డీ జట్టు వరుసగా రెండో స్వర్ణ పతకం.
శుక్రవారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత మహిళా జట్టు ఇరాన్ పై 31—21 తో గెలిచింది.కబడ్డీలో ఎదురులేని భారత మహిళా జట్టు కష్టపడకుండానే సునాయాసంగా గెలిచింది.గత ఆసియా క్రీడల నుండే మహిళా కబడ్డీ చేర్చారు.
భారత్ మహిళా జట్టు స్వర్ణం గెలవడం గర్వకారణమని,వారికి నా కృతజ్ఞతలు అని ప్రధాని నరేంద్రమోడీ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

4x400 మీ రిలేలో భారత్ మహిళల జట్టు 17వ ఆసియా గేమ్స్ లో స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది.ప్రియాంక పన్వర్,టింటు ల్యుకా,మన్ దీప్ కౌర్,పూవమ్మ లతో కూడిన భారత్ జట్టు 3:28:68 సమయంలో రేసు ముగించి స్వర్ణాన్ని దక్కించుకుంది.దీంతో వరుసగా నాలుగు సార్లు(2002 బూసాన్ ఆసియా క్రీడలనుండి)భారత్ మహిళల రిలే జట్టు స్వర్ణాన్ని గెలుస్తూ వస్తుంది.2010 ఆసియా క్రీడల్లో నమోదు చేసిన సమయం(3:29.02)కంటే ఈసారి అత్యున్నత సమయం నమోదు చేశారు భారత మహిళల రిలే జట్టు.
జపాన్ 3:30.80 సమయంతో రెండోస్థానంలో నిలిచి రజత పతకాన్ని,చైనా 3:32.02 సమయతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకున్నాయి.చివరి ల్యాప్ లో పరిగెత్తిన పూవమ్మ అనూహ్యంగా పుంజుకొని జపాన్ క్రీడాకారిణిని వెనక్కినెట్టి మొదటి స్థానంలో నిలిచి భారత్ కు వరుసగా 4వ స్వర్ణాన్ని అందించింది.
పురుషుల షాట్ పుట్ విభాగంలో 20 సంవత్సరాల ఇందర్జీత్ 19.63 మీటర్లు విసిరి కాంస్య పతాకాన్ని దక్కించుకున్నాడు.ట్రిపుల్ జంప్ లో స్వర్ణాన్ని ఆశించిన అర్పిందర్ సింగ్ 5వ స్థానంలో నిలిచి నిరాశపరిచాడు.
భారత అథ్లెట్లు ఇప్పటివరకు 13 పతకాలు గెలుచుకున్నారు.అందులో రెండు స్వర్ణాలు,3 రజత,8 కాంస్యాలు ఉన్నాయి.గత ఆసియా క్రీడల కంటే ఒక పతకాన్ని ఎక్కువగా గెలుచుకున్నా స్వర్ణ పతకాల సంఖ్య మాత్రం తగ్గింది.గతసారి 5 స్వర్ణ,2 రజత,5 కాంస్య పతకాలు గెలుచుకున్నారు.

ఎట్టకేలకు భారత హాకీ జట్టు ఆసియా క్రీడల్లో బంగారు పతాకాన్ని సాధించింది.16 సంవత్సరాల నిరీక్షణ ఫలించింది.చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను ఫైనల్ లో చిత్తు చేసి స్వర్ణం చేజిక్కించుకుంది.
ఇంచియాన్ వేదికగా జరుగుతున్న 17వ ఆసియా గేమ్స్ లో భాగంగా పురుషుల హాకీ ఫైనల్ లో భారత్,పాక్ లు తలబడ్డాయి.హోరాహోరీగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత్ జట్టు షూటౌట్ ద్వారా 4-2 తేడాతో పాక్ ను ఓడించి 2016లో జరిగే రియో ఒలింపిక్స్ కు అర్హత సాధించింది.
ఆట నిర్ణీత సమయం 60 నిమిషాల్లో ఇరు జట్లు చెరో గోల్ చేయడంతో మ్యాచ్ ఫలితాన్ని పెనాల్టీ షూటవుట్ ద్వారా నిర్ణయించారు.భారత గోల్ కీపర్ శ్రీజేష్ పాక్ ఆటగాళ్ళు కొట్టిన షాట్లు గోల్ కాకుండా అధ్బుతంగా అడ్డుకొని భారత్ కు స్వర్ణం అందించడంలో ముఖ్యపాత్ర పోచించాడు.
ఆసియ క్రీడల్లో భారత్ బోణీ కొట్టింది.
10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో శ్వేతా చౌదరి కాస్యం సాధించింది.
50మీ పిస్టల్ ఈవెంట్లో భారత్ షూటర్ జితూ రాయ్ భారత్ కు మొదటి స్వర్ణ పతకాన్ని అందించాడు.

యుఎస్ ఓపెన్ మహిళల డబుల్స్ సెమీస్ లో సానియా-కారా బ్లాక్ జోడి అన్ సీడెడ్ హెంగిస్-సేన్నేట్టా చేతిలో 2-6,4-6 తేడాతో ఓటమి పాలయింది.
మేజర్ టోర్నీ లో 12 సంవత్సరాల తరువాత మార్టినా హెంగిస్ ఫైనల్ కు ప్రవేశించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
గత సంవత్సరం యుఎస్ ఓపెన్ మహిళల డబుల్స్ సెమీస్ లో కూడా ఓడిపోయింది.
మిక్స్డ్ డబుల్స్ లో మాత్రం సోరేస్ తో జతకట్టిన సానియా ఫైనల్ లోకి ప్రవేశించింది.ఫైనల్ లో వీరు అన్ సీడెడ్ జంట యుఎస్ఎ కు చెందిన ఆబిగైల్ స్పియర్స్ మెక్సికో కు చెందిన శాంటియాగో  గొంజాలెజ్ తో తలపడతారు.
| Copyright © 2013 Radio Jalsa News