మైక్రోసాఫ్ట్ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ తన తదుపరి విండోస్ వర్షన్ 10 అని ప్రకటించింది.అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ విండోస్-9 తదుపరి వర్షన్ అనుకున్న ప్రతీ ఒక్కరికి షాక్ ఇస్తూ మైక్రోసాఫ్ట్ విండోస్ 10 ను వచ్చే సంవత్సరం విడుదల చేయనున్నట్లు తెలిపింది.

మంగళవారం భారత కాలమాన ప్రకారం రాత్రి 11 గంటల సమయంలో సాన్ ఫ్రాన్సిస్కో లో మైక్రోసాఫ్ట్ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఈ విషయాలు తెలిశాయి.మైక్రోసాఫ్ట్ లో ఆపరేటింగ్ సిస్టమ్స్ హెడ్ గా ఉన్న టెర్రీ మ్యేర్సన్ ఈ వివరాలు వెల్లడించారు.
టెర్రీ మ్యేర్సన్ వివరాలు చెప్తూ విండోస్ విడుదల చేస్తున్న తదుపరి ఆపరేటింగ్ సిస్టం పేరు విండోస్ 9 ఎందుకు పెట్టలేదో మాత్రం వివరించలేదు.1.5 మిలియన్ మంది ప్రస్తుతం విండోస్ ఉపయోగిస్తున్నారు అని ఈ ఈవెంట్ ను నిర్వహించిన టెర్రీ చిన్న స్టూల్ మీద కూర్చొని వివరించారు.సరికొత్త జనరేషన్ కు విండోస్ 10 ప్రాతినిధ్యం వహిస్తుంది అని టెర్రీ ఆశాభావం వ్యక్తం చేశారు.విండోస్ 10 ఒక సమగ్ర వేదిక కానుంది అని టెర్రీ తెలిపారు.


ఆఫ్రికాను వణికిస్తున్న ఎబోలా వైరస్ అంతానికి ఐరాస చేస్తున్న పోరాటానికి భారత్ తనవంతు సాయం చేయనుంది.
భారత్ నేడు 12 మిలియన్ల అమెరికన్ డాలర్ల ఆర్ధిక సహాయాన్ని ప్రకటించింది.
ప్రధాని నరేంద్రమోడి అమెరికా పర్యటనకు బయల్దేరేముందు దీనికి ఆమోదం తెలిపారు.
ఈ మొత్తాన్ని యూఎస్ సెక్రటరీ జనరల్ ఫండ్ కు జమ చేస్తారు.

మార్స్ ఆర్బిటర్ మిషన్(మామ్)ను అంగారక గ్రహ కక్ష్యలోకి ప్రవేశపెట్టే ప్రక్రియలో భాగంగా శాస్త్రవేత్తలు మామ్ లోని లామ్ ను మండించారు.ఈ ప్రక్రియ ఎనిమిది దశల్లో జరిగింది.
సక్రమంగా అన్ని ఇంజన్లు పని చేస్తున్నాయని ఇస్రో నిర్ణయించుకున్నది.
మామ్ మార్స్ కక్ష్యలోకి దిగ్విజయంగా ప్రవేశించింది.అంగారక గ్రహంపై ప్రయోగాల కోసం ఇస్రో ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ ప్రయోగం విజయవంతమైంది.
దీంతో బారత అంతరిక్ష పరిశోధనలో చరిత్రాత్మక ఘట్టం నమోదైంది.
భారత్ అరుణ గ్రహానికి ఉపగ్రహాన్ని పంపిన నాలుగో దేశంగా గుర్తింపు పొందింది.
మొదటి మూడు
1.అమెరికా
2.రష్యా
3.యూరోపియన్ యూనియన్
4.భారత్
అంగారక కక్ష్యలోకి మొదటి ప్రయత్నంలోనే ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టిన తొలి దేశంగా, అదేవిధంగా తొలి ఆసియా దేశంగా భారత్ రికార్డు సృష్టించింది.
పూర్తి స్వదేశి పరిజ్ఞానంతో,అతి తక్కవ వ్యయంతో గ్రహాంతర ప్రయోగాన్ని సునాయాసంగా ప్రయోగించిన ఇస్రోను చూసి ప్రపంచమే నివ్వెరపోయింది.
బుధవారం అంగారకుడి కక్ష్యలోకి మార్స్ ఆర్బిటర్ మిషన్ ను(మామ్)ఇస్త్ర శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రవేశపెట్టారు.
ఉదయం తెల్లవారుజామున 4:49 గంటలకు ప్రారంభమైన కక్ష్య ప్రవేశ ప్రక్రియ 8:05 గంటలకు ముగిసింది.ఇస్రో గ్రాండ్ స్టేషన్ కు ఆ వెంటనే సందేశాలు పంపడం ప్రారంభించింది.
కొద్ది రోజులుగా ఈ ప్రయోగంపై ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న యావత్ భారతదేశం ఈ శుభవార్త విని పులకరించిపోయింది.
కాశ్మీర్ అంశంపై పాకిస్థాన్ అధ్యక్షుడి కొడుకు బిలావల్ భుట్టో వివాదస్పద వాఖ్యలు చేశాడు.
ఎప్పటికైనా కాశ్మీర్ ను పాకిస్థాన్ తో కలుపుతామని వాఖ్యానించాడు.
కాశ్మీర్ లోని ప్రతి అడుగు పాకిస్థాన్ కు చెందినదేనని మాట్లాడాడు.
బిజేపి, బిలావల్ భుట్టో వాఖ్యలపై మండిపడింది.కాశ్మీర్ ఎప్పటికీ భారత్ లో అంతర్భాగమేనని, పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా భారత్ భుభాగంగానే ఉందన్నారు.
భారత ప్రజల హృదయాల్లో కాశ్మీర్ రాష్ట్రం ఉందని బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్ అన్నారు.
భారత సంతతి వ్యక్తిని అమెరికా అధ్యక్షుడు ఒబామా అత్యంత కీలకమైన రాయబార బాధ్యతలు అప్పగింత నిమిత్తం ఎంపిక చేసుకున్నారు.
ఒబామా భారత్ లో అమెరికా రాయబారిగా రిచర్డ్ రాహుల్ వర్మ(45)పేరును ప్రతిపాదించారు.
ఆయన గురువారం రిచర్డ్ రాహుల్ వర్మ పేరును ప్రకటించారు.
భారత ప్రధాని నరేంద్రమోడి త్వరలో అమెరికా పర్యటనకు రానున్న నేపధ్యంలో ఈ కీలక ప్రతిపాదనను ఒబామా చేశారు.
దీంతో పాటు పరిపాలనా యంత్రాంగానికి సంబంధించి మరికొన్ని నియామకాలను ఒబామా చేపట్టారు.
రిచర్డ్ రాహుల్ వర్మ విషయంలో ఒబామా చేసిన ప్రతిపాదనను సెనేట్ ఆమోదించాల్సి ఉండి.
అదే జరిగితే..అత్యంత కీలకమైన ఈ పదవికి ఎంపికైన తొలి భారత సంతతి అమెరికా పౌరిడిగా రాహుల్ వర్మ ప్రత్యేకతను సాధిస్తారు.
ఆయన అమెరికా విదేశాంగ శాఖతో సహా వివిధ విభాగాల్లో కీలక పదవులు నిర్వహించారు.
ఆయన ప్రస్తుతం హ్యూమన్ రైట్స్ ఫస్ట్,ది క్లింటన్ ఫౌండేషన్, నేషనల్ డెమోక్రాటిక్ ఇన్స్టిట్యూట్ బోర్డు లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
నాన్సీ పావెల్ రాజీనామా తర్వాత భారత్ లో అమెరికా రాయబారి పదవి ఖాళీగా ఉండి.వర్మ పేరును ఈ కీలకపదవికి ప్రతిపాదించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది.
ఈ నెలాఖరులో ఒబామాను మోడీ కలవనున్న నేపధ్యంలో అమెరికా ,భారత్ ల మధ్య సైనిక సంబంధాలు సుస్థిరం,సుధ్రుడం చేసుకోవాలని యూ.ఎస్ ఆర్మీ చీఫ్ అన్నారు.
యుధ్అభ్యాన్ 2014కు చైనా అధ్యక్షుని పర్యటనకు ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.
యుధ్అభ్యాన్ 2014 పేరిట ఉత్తరాఖండ్ లో అమెరికా,భారత్ ల మధ్య జరుగుతున్న సంయుక్త సైనిక విన్యాసం పదవది.
వరదలతో అతలాకుతలమైన జమ్మూ కాశ్మీర్ రాష్టానికి మిలిండా బిల్ గేట్స్ ఫౌండేషన్ ఆర్ధిక సాయం ప్రకటించింది.
రూ.4.25 కోట్ల అత్యవసర ఆర్ధిక సాయాన్ని ఫౌండేషన్ ప్రకటించింది.
చైనా సంచార ప్రజలు 10 రోజులుగా తమ గుడారాలను లఢక్ ప్రాంతంలోని దేమ్చాఖ్ లో అక్రమంగా వేసి కొనసాగిస్తున్నారు.
చైనా సైన్యం ప్రోద్బలంతో అక్కడ నిర్మిస్తున్న సాగునీటి కలువకు వ్యతిరేకంగా ఈ గుడారాలను వేశారు. భారత సరిహద్దుకు అర కి.మీ ఈవల ఇవి వేయడం గమనార్హం.
లడఖ్ సెక్టార్ లోని చమురు ప్రాంతంలో చైనా సైన్యం మరోసారి అతిక్రమణకు పాల్పడినట్లు సమాచారం.
చైనా సైన్యం భారత భూభాగంలోకి చోచ్చుకురవడంతో వారిని ఎదురుకోవడానికి ITBP సిబ్బంది, సైన్యం తరలివెళ్లినట్లు తెలుస్తుంది.

చైనా అధ్యక్షుడు అహ్మదాబాద్ చేరుకున్న తర్వాత ప్రధాని మోడీ తో హయత్ హోటల్ లో భేటి అయ్యారు.
ఈ భేటి అనంతరం ఇరు దేశాల అధికారులు మూడు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు.
గుజరాత్ ,గ్వాంగ్ జూ ప్రావిన్స్ పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శులు తొలి ఒప్పందంపై సంతకాలు చేశారు.గుజరాత్ లో పారిశ్రామిక పార్కు ఏర్పాట్లకు వీరి మధ్య ఒప్పందం కుదిరింది.
గుజరాత్ పారిశ్రామికాభివృద్ధి కార్పొరేషన్, చైనా డెవలప్ మెంట్ బ్యాంక్ మధ్య రెండో ఒప్పందం జరిగింది. ఉపాధ్యక్షుడు రెండో ఒప్పందంపై , గుజరాత్ పారిశ్రామికాభివృద్ధి కార్పోరేషన్ కార్యదర్శి సంతకాలు చేశారు.
అనంతరం ఈ రోజు సాయంత్రం చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ గుజరాత్ లోని సబర్మతీ ఆశ్రయాన్ని సందర్శించారు.
ఈ రోజు సాయంత్రం సతీ సమేతంగా భారత పర్యటనకు వచ్చిన జిన్ పింగ్ కు మోడీ తేనెటీ విందు ఇచ్చారు.
ఆశ్రయంలో సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించిన తర్వాత ప్రధాని ఇచ్చిన తేనెటీ విందులో జిన్ పింగ్ పాల్గొని రాత్రికి ఆయన ఢిల్లీ బయల్దేరి ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ,విదేశీ వ్యవహారాలమంత్రి సుష్మాస్వరాజ్ లతో పాటు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధిలతో ఆయన భేటి కానున్నారు.
మగవారి దృష్టిలో అమ్మాయిలు 21 సంవత్సరాలు దాటితే అంత అందంగా కనిపించరని ఒక అంతర్జాతీయ అధ్యయన సంస్థ తెలిపింది.వారు ఈ అధ్యయనంలో చాలా ఆసక్తికర అంశాలు తెలిపారు.
20-24 వయసు మధ్య ఉన్న అమ్మాయిలు అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తారు అని 50 సంవత్సరాల వయసు వరకు ఉన్న మగవాళ్ళు భావిస్తారు అని వారి అధ్యయనంలో తేలింది.అదే అమ్మాయిల విషయానికి వస్తే అమ్మాయిలు తమకంటే ఒక సంవత్సరం తక్కువ లేదా సమాన వయసు ఉన్న పురుషులు తమని చూడడాన్ని ఇష్టపడతారట.అదే 50 సంవత్సరాల వయసున్న స్త్రీలకు 48 లేదా 49 సంవత్సరాల వయసున్న పురుషులు ఆకర్షణీయంగా కనిపిస్తారట.కాని పురుషులు మాత్రం తమ వయసులో సగం కన్నా తక్కువ వయసు ఉన్న స్త్రీలు తమని చూడాలని అనుకుంటారని ఈ అధ్యయనం తెలిపింది.
పురుషులు మహిళల విషయంలో ఏవిధంగా ఊహించుకుంటారు అనేది పరిశీలిస్తే సంకోచం లేకుండా 20 సంవత్సరాలు వారికే తమ ఓటు అంటారు.ఒక గ్రాఫ్ ను కూడా ఈ అధ్యయనం విడుదల చేసింది.ఈ గ్రాఫ్ ప్రకారం 22 సంవత్సరాలు వయసు వచ్చే వరకు 20 సంవత్సరాల వయసప్పుడు ఉన్న అందాన్ని కోల్పోతారు
140 క్యారెక్టర్లలో ట్విట్టర్ లో తమ అభిప్రాయాలను తెలియజేస్తూ ట్విట్ చేయడం వల్ల భాషా సామర్ధ్యం మెరుగుపడుతుందని ఓ సర్వే తాజా నివేదిక వెల్లడించింది.
ట్విట్టర్ లో ఎక్కువగా ఉపయోగించే 100 పదాలపై ఈ సర్వేలో భాగంగా పరిశోధన చేశారు.వాటిలో ఆర్ టీ(రీట్విట్),యు (వైఓయు) రెండు పదాలు మాత్రమే షార్ట్ కట్ గా ఉపయోగిస్తున్నారని తేలింది.
ట్విట్టర్ వినియోగ దారులకు 140 క్యారెక్టర్ల వల్ల భాషా మెరుగు పడటంతో పాటు తక్కువ పదాలతో అర్ధవంతంగా చెప్పడంపై మంచి అవగాహన వస్తోందని పరిశోధకులు పేర్కొన్నారు.
అధికారిక పర్యటన కోసం భారత విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ బుధవారం ఆఫ్ఘానిస్థాన్ లోని కాబుల్ వెళ్లనున్నారు.భారత్ కు వ్యూహాత్మకంగా ఎంతో కీలక భాగస్వామిగా ఉన్న ఆఫ్ఘానిస్థాన్ తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడమే లక్యంగా ఆమె పర్యటన చేపట్టారు.ఆఫ్ఘానిస్థాన్ అధ్యక్షుడు కర్జాయ్ తో సుష్మా సమావేశం అవుతారు.
దక్షిణాఫ్రికా లోని జోహనెస్ బర్గ్ వద్ద జరుగుతున్న తవ్వకాల్లో ఆద్భుతమైన,నమ్మశక్యం కాని 232.08 క్యారెట్ల వజ్రం
బయటపడింది.దీని విలువ సుమారు రూ.80 కోట్లు ఉంటుందని అంచనా.ఇది అసాధారణమైన పరిమాణంలో ఉండి అత్యంత స్పష్టత కలిగి ఉంది ఈ వజ్రం.
దక్షిణాఫ్రికాలోని కలినన్ గనిలో పేట్రా డైమండ్స్ జరుపుతున్న తవ్వకాలో ఈ D-కలర్ టైప్ 2 వజ్రం బయటపడింది.
ఈ D-కలర్ టైప్ 2 వజ్రాలు చాలా కాలం క్రితం ఏర్పడ్డాయి.ఇవి చూడడానికి చాలా పెద్దవిగా,ఒక ఆకారం అంటూ లేకుండా ఉంటాయి మరియు కొలవదగిన నత్రజని మలినాలు ఏమి ఉండవు.కాబట్టి రంగు మరియు నాణ్యత విషయంలో వీటికి సాటేవిలేవు.అందుకే ఈ వజ్రాలకు చాల విలువ ఉంటుంది.
1905 సంవత్సరంలో ఇదే గనిలో 3,106 క్యారెట్ల వజ్రం తవ్వకాల్లో బయటపడిందట.
ఈ నెల 13న భారత రాష్ట్రాల ప్రతినిధులతో అబుదాబిలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని భారత రాయబార కార్యాలయం,ప్రవాస బారతీయ వ్యవహార మంత్రిత్వశాఖల సంయుక్త ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించనున్నారు.
ఇందులో గోవా,పంజాబ్ రాష్టాల మంత్రులు మరియు వివిధ రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొంటున్నారు.ఈ సదస్సుకు తెలంగాణా,ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రులు కేసిఆర్,చంద్రబాబులకు ఆయా రాష్ట్రాల అధికారులతో పాటు మంత్రులను కూడా పంపాలని ఆదివారం వారికీ వినతి పత్రాలు సమర్పించినట్లు వలసదారుల హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మంద భీంరెడ్డి మీడియాకు తెలిపారు.
యూఏఈ లో 17.5 లక్షల మంది భారతీయులు నివసిస్తుండగా తెలంగాణా,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు ఇందులో 1.7 లక్షల మంది ఉన్నట్లు అబుదాబిలోని భారత రాయబార కార్యాలయం లెక్కల ప్రకారం తెలుస్తుంది.
ఈ సదస్సులో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వలస కార్మికుల సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై అలాగే వలస కార్మికుల ఫిర్యాదులను పరిష్కరించడానికి ప్రవాసి భారతీయ సంఘాల పాత్రపై చర్చించనున్నారు.

ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ కి భారత ప్రధానమంత్రి నరేంద్రమోడి ఢిల్లీ లో ఘన స్వాగతం పలికారు.టోనీ పర్యటన భారత్ ఆస్ట్రేలియాల మధ్య సంబంధాలను మరింత పటిష్టం చేస్తుందని తాను నమ్ముతున్నట్లు మోడీ తన ట్విట్టర్ లో తెలిపారు.దాంతో టోనీ అబాటో కూడా ఎంతగానో సంతోషించారు.అంతేకాదు మోడీ తనకు అధ్బుతమైన స్వాగతం పలికారు అని ట్విట్ కూడా చేశారు. 
టోనీ అబాట్ ఇండియాలో రెండు రోజులు పర్యటించనున్నారు.ముఖ్యంగా యురేనియం ఎగుమతుల ఒప్పందం కోసం ఇరు దేశాలు చర్చించుకోనున్నాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ గురువారం విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం 2012 సంవత్సరంలో భారత్ లోనే ఎక్కువ ఆత్మహత్యలు నమోదయ్యాయట.ఈ నివేదిక ప్రకారం ప్రపంచంలో ప్రతీ 40 సెకండ్లకు ఒక ఆత్మహత్య నమోదు అవుతుంది.
ప్రపంచంలో ఇతర ప్రదేశాలతో పోల్చుకుంటే ఎక్కువ ఆత్మహత్యలు అగ్నేయసియా దేశాల్లోనే నమోదవుతున్నాయి.అందునా ఇండియాలో ఎక్కువ ఆత్మహత్యలు జరుగుతున్నాయని నివేదిక తెలిపింది.ఈ నివేదిక ప్రకారం ఇండియాలో 2012 సంవత్సరంలో 2 లక్షల 58 వేల 75 మంది ఆత్మహత్య చేసుకోగా అందులో పురుషులు 1 లక్ష 58 వేల 98 మంది,మహిళలు 99 వేల 9 వందల 77 మంది ఉన్నారు.
ఇంకా ఈ నివేదికలో చాలా ఆసక్తికర అంశాలు ఉన్నాయి.అత్యధికంగా ఆత్మహత్యలకు గురయ్యే దేశాలో గయానా(44.2 per 100,000) మొదటి స్థానంలో ఉంది.తరువాతి స్థానాల్లో ఉత్తర,దక్షిణ కొరియాలు(38.5 మరియు 28.9),శ్రీలంక(28.8),లుథియానే(28.2),సురినామ్(27.8),మొజాంబిక్(27.4),నేపాల్ మరియు టాంజేనియా(24.9 each),బురుండి(23.1),ఇండియా(21.1),సౌత్ సుడాన్(19.8)లు వరుసగా ఉన్నాయి.
ఈ నివేదిక ప్రకారం ప్రపంచంలో ప్రతీ సంవత్సరం 8 లక్షలకు పైబడే ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు.75 శాతం ఆత్మహత్యలు తక్కువ ఆదాయం గల దేశాల్లోనే జరుగుతున్నాయి.ఆత్మహత్యలు చేసుకునే వారు ఎక్కువగా ఏవిధంగా చేసుకుంటున్నారో కూడా ఈ నివేదికలో తెలిపింది ప్రపంచ ఆరోగ్య సంస్థ.ఎక్కువమంది పురుగుమందులు తాగి,ఉరి వేసుకొని,కాల్చుకొని చనిపోతున్నారట.ప్రస్తుతానికి కేవలం 25 దేశాల్లోనే జాతీయ ఆత్మహత్య నివారణ వ్యూహాలు పాటిస్తున్నాయని నివేదికలో పొందుపరిచారు.
అన్ని వయసుల వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు,ముఖ్యంగా 70 సంవత్సరాల వయసు పైబడిన వారు ఎక్కువ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు,కొన్ని దేశాల్లో యువకులే ఎక్కువమంది ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు,ప్రపంచవ్యాప్తంగా 15-29 సంవత్సరాల యువకులు మరణించడానికి గల కారణాల్లో ఆత్మహత్య రెండో అతిపెద్ద కారణం అని ఈ నివేదిక తెలిపింది.
మాములుగా అయితే మహిళల కంటే పురుషులే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు,ధనిక దేశాల్లో అయితే మహిళల కంటే మూడొంతుల మంది పురుషులు ఆత్మహత్య చేసుకొని మరణిస్తున్నారు,ఆత్మహత్య కారణాలను పరిష్కరించడం ద్వారా వీటి ద్వారా జరిగే మరణాలను తగ్గించవచ్చు అని నివేదిక సూచించింది.
ఆత్మహత్యలు పెరగడానికి మీడియా కూడా ఒక ముఖ్య కారణమట.మీడియాలో వాడే బాషను మార్చుకోవాలి,ఆత్మహత్య ఇలా చేసుకున్నారు అలా చేసుకున్నారు అని సంచలనకోసం వివరించకూడదు అని కూడా నివేదిక సూచించింది.
| Copyright © 2013 Radio Jalsa News