మైక్రోసాఫ్ట్ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ తన తదుపరి విండోస్ వర్షన్ 10 అని ప్రకటించింది.అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ విండోస్-9 తదుపరి వర్షన్ అనుకున్న ప్రతీ ఒక్కరికి షాక్ ఇస్తూ మైక్రోసాఫ్ట్ విండోస్ 10 ను వచ్చే సంవత్సరం విడుదల చేయనున్నట్లు తెలిపింది.

మంగళవారం భారత కాలమాన ప్రకారం రాత్రి 11 గంటల సమయంలో సాన్ ఫ్రాన్సిస్కో లో మైక్రోసాఫ్ట్ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఈ విషయాలు తెలిశాయి.మైక్రోసాఫ్ట్ లో ఆపరేటింగ్ సిస్టమ్స్ హెడ్ గా ఉన్న టెర్రీ మ్యేర్సన్ ఈ వివరాలు వెల్లడించారు.
టెర్రీ మ్యేర్సన్ వివరాలు చెప్తూ విండోస్ విడుదల చేస్తున్న తదుపరి ఆపరేటింగ్ సిస్టం పేరు విండోస్ 9 ఎందుకు పెట్టలేదో మాత్రం వివరించలేదు.1.5 మిలియన్ మంది ప్రస్తుతం విండోస్ ఉపయోగిస్తున్నారు అని ఈ ఈవెంట్ ను నిర్వహించిన టెర్రీ చిన్న స్టూల్ మీద కూర్చొని వివరించారు.సరికొత్త జనరేషన్ కు విండోస్ 10 ప్రాతినిధ్యం వహిస్తుంది అని టెర్రీ ఆశాభావం వ్యక్తం చేశారు.విండోస్ 10 ఒక సమగ్ర వేదిక కానుంది అని టెర్రీ తెలిపారు.


సోషల్ మీడియా కంపెనీ యజమానులకు వరంగా మారింది.ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే వారి నేపథ్యాన్ని తెలుసుకునే సాధనంగా సోషల్ మీడియా ఉపయోగపడుతుంది.సోషల్ మీడియాలో వారిగురించి లభించిన ప్రతికూల అంశాల ఆధారంగా 68% మంది యజమానులు వ్యక్తుల నియామకానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటున్నారని కెరీర్ బిల్డర్ చేసిన సర్వేలో తేలింది.
ఈ సర్వే ప్రకారం 59% కంపెనీలు తమకు సరిపోయే అభ్యర్థి కోసం ప్రస్తుతం సోషల్ మీడియానే సాధనంగా ఉపయోగించుకుంటున్నాయి,33%కంపెనీలు తమకు కావాల్సిన ప్లాట్ ఫామ్ ఆధారంగా ఉద్యోగులను నియమించుకుంటున్నాయని సర్వే తెలిపింది.
దేశంలో నిర్వహించిన 1200 కార్పొరేట్ కంపెనీల అభిప్రాయాల ఆధారంగా ఈ సర్వే రూపొందించారు.
అంతే కాకుండా 75% కంపెనీలు సామర్థ్యం ఉన్న ఉద్యోగులకోసం గూగుల్ లాంటి సెర్చ్ ఇంజిన్లు వాడుతున్నారు అని సర్వే తెలిపింది.
చాలా కంపెనీలు ఉద్యోగం కోసం వచ్చే వారిని తిరస్కరించడానికి ముఖ్య కారణం వారి విద్యార్హతలు తప్పుగా చుపిస్తున్నారట,దాదాపు 50% మంది తప్పుడు విద్యార్హతలతో ఉద్యోగం సంపాదించాలని చూస్తున్నారని,50%మందికి సరైన కమ్యూనికేషన్ స్కిల్ల్స్ లేవని,47% మంది సరికాని ఫోటోలు,తప్పుడు సమాచారం,రెచ్చగొట్టే పోస్టులు చేస్తున్నారని,గత కంపెనీ గురించి రహస్యాలను 42% మంది బహిర్గతం చేస్తున్నారని సర్వే వివరించింది.
38% అభ్యర్థులు వారికున్న మందు అలవాట్లు లేక డ్రగ్ అలవాట్లను పోస్ట్ చేస్తున్నారట,35% మంది అందులో నేర ప్రవర్తన కలిగినవారని,32%మందికి ఇది వరకు కంపెనీల్లో లేదా సహచర ఉద్యోగుల్లో చెడ్డపేరు ఉంటుందని సర్వే సూచించింది.
కాబట్టి కార్పోరేట్ ఉద్యోగాల కోసం వెళ్ళే వారు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చింది పోస్ట్ చేయకుండా ఉంటె మంచిది.
| Copyright © 2013 Radio Jalsa News