ఈ రోజు హీరో కంపెనీ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో హీరో మోటార్ సంస్థకి ఒప్పందం కుదిరింది.
ప్రభుత్వం కంపెనీ ప్రతినిధి రాకేశ్ వశిస్ట్ తో ఈ ఒప్పందం చేసుకుంది.18 నెలల్లో ప్లాంట్ పూర్తయ్యేలా ఒప్పందం చేసుకున్నారు.
హీరో ప్లాంట్ ద్వారా 10 వేల మందికి ఉపాధి లభించనుంది.
వీలైనంత త్వరగా కర్మాగారం ఏర్పాటు చేసేందుకు హీరో సంస్థ కృషి చేయాలనీ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
తమిళనాడు ప్రభుత్వం నిర్వహిస్తున్న అమ్మ క్యాంటిన్ల అధ్యయనానికి ఆంధ్రప్రదేశ్ మంత్రులు,అధికారుల బృందం చెన్నై పర్యటించనుంది.
మంత్రులతో పాటు అనంతపురం, చిత్తూరు, గుంటూరు, విశాఖ జిల్లాల కలెక్టర్లు, పౌరసరఫరా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు చెన్నైలో పర్యటించనున్నారు.
క్యాంటిన్ల నిర్వహణతో పాటు స్థలం, ఆర్ధిక అంశాలు కూడా పరిశీలిస్తామని మంత్రి సునిత తెలిపారు.

దేశంలోనే మొదటిసారి ఈ-క్యాబినెట్ నిర్వహించిన ఘనత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దక్కింది.
క్యాబినెట్ మీటింగ్ నిర్వహించిన ప్రతీసారి మంత్రుల చేతిలో పేపర్లు,ఫైళ్లు కనిపిస్తాయి.అందుకు భిన్నంగా సోమవారం చంద్రబాబునాయుడు నిర్వహించిన క్యాబినెట్ కు మంత్రులు ఐపాడ్ లతో హాజరయ్యారు. 1995 నుండి 2004 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు చంద్రబాబునాయుడు ఈ-గవర్నెన్స్ విధానాన్ని ప్రవేశపెట్టారు.ఈ దఫా కూడా ‘క్లౌడ్’ లాంటి టెక్నాలజీని వాడుకునే పనిలో పడ్డారు చంద్రబాబు.
ప్రస్తుతం ఈ-క్యాబినెట్ కోసం ‘ఫైల్ క్లౌడ్’ టూల్ ద్వారా మంత్రులు మరియు ప్రభుత్వ అధికారులు ఫైల్ షేరింగ్ జరుపుకునే అవకాశం ఉంది. ఇది విజయవంతం అవడంతో ఇకనుండి ఈ విధానాన్నే అనుసరించనున్నారు చంద్రబాబునాయుడు.
రాష్ట్ర గవర్నర్ నరసింహన్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు.తన పర్యటనలో ఆయన ప్రధాని నరేంద్రమోడిని కలవనున్నారు.
తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సమస్యలపై ప్రధానితో చర్చించనున్నారు.
మణిపూర్ లోని ఎన్ఐటీ కళాశాలలో విద్యార్ధుల మధ్య లోకల్ నాన్ లోకల్ ఘర్షణ తలెత్తింది.కళాశాలలో చదువుతున్న తెలంగాణా,ఆంధ్రప్రదేశ్ లకు చెందిన తెలుగు విద్యార్ధులపై మణిపూర్ విద్యార్ధులు దాడికి పాల్పడ్డారు.తెలుగు విద్యార్ధులపై గత నలుగు రోజులుగా దాడులు కొనసాగుతున్నట్లు సమాచారం.దాడులపై విద్యార్ధులు ఎన్ఐటీ యాజమాన్యానికి ,స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని విద్యార్ధులు తెలుపుతున్నారు.లోకల్ విద్యార్ధులు గుండాలతో కూడా దాడి చేయిస్తున్నట్లు విద్యార్ధులు ఆరోపిస్తున్నారు.బిక్కుబిక్కు మంటూ తెలుగు విద్యార్ధులు కాలేజీలోనే ఉంటున్నారు.
ఘనంగా గీతం యూనివర్సిటీ స్నాతకోత్సవం జరిగింది.
ఈ సందర్భంగా రక్షణ మంత్రిత్వ శాఖ శాస్త్ర సలహాదారు,రక్షణ పరిశోధనాభివృద్ధి విభాగం కార్యదర్శి డాక్టర్ అవినాశ్ చందర్,దర్శకుడు రాఘవేంద్రరావు, మార్గదర్శి చిట్ ఫండ్స్ ఎండి శైలజా కిరణ్,ప్రముఖ పాటల రచయిత సుద్దాల అశోక్ తేజ గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు.
వీరికి గీతం ఛాన్సలర్ డాక్టర్ కోనేరు రామకృష్ణ రావు డాక్టరేట్లను ప్రధానం చేశారు.
అవినాశ్ చందర్ అనంతరం మాట్లాడుతూ భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగంలో ప్రపంచమేటి శక్తిగా ఎదుగుతుందని ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయాలు దేశానికి ఉపయోగపడే పరిశోధనలకు కేంద్రాలు కావాలని పిలుపునిచ్చారు.
తెలంగాణాలోని మెదక్ లోక్ సభ స్థానానికి,ఆంధ్రప్రదేశ్ లోని నందిగామ అసెంబ్లీ నియోజకవర్గానికి జరుతున్న ఉపఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది.
మెదక్ ఉపఎన్నిక కోసం 1817 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం పోలింగ్ మందకోడిగా కొనసాగుతుంది.పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయలేదని గంగాపూర్ గ్రామస్థులు,రోడ్డు సౌకర్యం లేదని పెద్దాపూర్ గ్రామస్థులు పోలింగ్ ను బహిష్కరించారు.మంత్రి హరీష్ రావు సిద్దిపేటలో ఓటు వేయగా తెరాస అభ్యర్థి కొత్తా ప్రభాకర్ రెడ్డి పోచారంలో బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డి సంగారెడ్డిలో కాంగ్రేస్ అభ్యర్థి సునితా లక్ష్మారెడ్డి గోమారంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.దాదాపు మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో 15 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు.
కృష్ణా జిల్లా నందిగామ అసెంబ్లీకి జరుగుతున్న ఉపఎన్నిక పోలింగ్ కూడా చాల మందకోడిగా సాగుతుంది.మొత్తం 200 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.టీడీపీ అభ్యర్థి సౌమ్య నందిగామలో ఓటుహక్కు వినియోగించుకున్నారు.
ఓట్ల లెక్కింపు సెప్టెంబర్ 16న జరుగుతుంది
 బ్లాక్ మెయిల్ చేస్తున్నాడనే ఆరోపణలతో క్రైమ్ వాచ్ యాంకర్ హర్షవర్ధన్ ను రెండు రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ఆదేశాలతో ఏలూరు సబ్ జైల్లో పెట్టిన విషయం తెలిసిందే.
హర్షవర్ధన్ తో పాటు మరో నలుగురు కూడా ఇందులో నిందితులు.పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాలలో ఉన్న సెయింట్ జోసెఫ్ డెంటల్ కళాశాల కరస్సాండెంట్‌ ఫాదర్‌ పి.బాలను హర్షవర్ధన్ బ్లాక్ మెయిల్ చేస్తూ రూ.5 కోట్లు డిమాండ్ చేశారనేది ఆరోపణ.మా దగ్గర కొన్ని సీడీలు ఉన్నాయని అడిగినంత డబ్బు ఇవ్వకుంటే వాటిని ప్రముఖ టీవీ చానల్లో ప్రసారం చేస్తాము అని బాలాను బెరించారు.అయితే ఇంతకి ఆ సీడీల్లో ఏముంది అనేది ప్రస్తుతానికి చర్చగా మారింది.అసలు నిజంగానే సీడీలు ఉన్నాయా లేకుంటే బెందిరించదానికే సీడీల నాటకం ఆడారా అనేదాని మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.పట్టుబడిన నలుగురిలో ఒకరు ప్రభుత్వ అధికారుల దగ్గరకు అమ్మాయిలను పంపి వారు ఏకాంతంగా ఉన్నప్పుడు రికార్డు చేసి బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపణలు ఉండడంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
కోట్లాది రూపాయలు విలువ చేసేంత సమాచారం ఆ సీడీల్లో ఉంటె కాలేజీ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చేది కాదని మరికొందరి వాదన.ఇన్నిరోజులుగా వీరి బారిన పడిన మరికొంత మంది కూడా డబ్బులు ఇచ్చారనే  సమాచారం పోలీసులకు అందుతుంది.ఇవే కాకుండా ఇంకేమైనా నేరాలకు వీరి గ్యాంగ్ పాల్పడిందా,వీరికి ఎవరెవరు సహకరించారు అని కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.ఆన్ని వివరాలు త్వరలోనే పోలీసుల విచారణలో బయటపడే అవకాశాలు ఉన్నాయి.

TV లో క్రైమ్ వార్తలు చదివే యాంకరే క్రైమ్ చేస్తే..
ఒక TV ఛానల్ లో క్రైమ్ వాచ్ పేరిట వచ్చే ప్రోగ్రాంకు యాంకర్ గా పనిచేసే హర్షవర్ధన్ ను విజయవాడలో పోలీసులు అరెస్ట్ చేశారు.పోలిసుల కథనం ప్రకారం పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాలలో ఉన్న సెయింట్ జోసెఫ్ డెంటల్ కళాశాల కరస్సాండెంట్‌ ఫాదర్‌ పి.బాలను హర్షవర్ధన్ బ్లాక్ మెయిల్ చేస్తూ రూ.5 కోట్లు డిమాండ్ చేశాడు.ఒకవేళ డిమాండ్ చేసిన డబ్బులు ఇవ్వకుంటే ఓ ప్రముఖ టీవీ ఛానల్ లో కళాశాలకు వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేస్తానని బెదిరించాడని పోలీసులు చెప్పారు.
డెంటల్ కళాశాల కరస్సాండెంట్‌ ఫాదర్‌ పి.బాల ఎస్ పి రఘురామి రెడ్డిని ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.ఫిర్యాదు మేరకు పోలీసులు మొదట హర్షవర్దన్ కు సహకరించిన నల్లజర్లకు చెందిన ఫాదర్ ల్యూక్‌బాబును మొదట అరెస్ట్ చేశారు.ల్యుక్ బాబు అందించిన సమాచారం ప్రకారం హర్షవర్ధన్ విజయవాడలో ఉన్నాడని తెలుసుకొని పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.
భీమడోలు మండలం తండ్రగుంటకు చెందిన యండ్రపాటి హర్షవర్ధన్ ప్రస్తుతం హైదరాబాద్ లో స్థిరపడ్డాడు.కొన్ని చిత్రాల్లో కూడా నటించాడు.

నంద్యాల వైకాపా MLA భూమానాగిరెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజాపద్దుల సంఘం ఛైర్మెన్ గా ఎంపికయ్యారు.
పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటి ఛైర్మెన్ గా-కాగిత వెంకటరావు (కృష్ణా జిల్లా పెడన తెదేపా శాసనసభ్యుడు)
అంచనాల కమిటి ఛైర్మెన్ గా-మోదుగుల వేణుగోపాల్ రెడ్డి (గుంటూరు పశ్చిమ తెదేపా MLA)నియమితులయ్యారు.
| Copyright © 2013 Radio Jalsa News